నిరుద్యోగుల కన్నెర్ర
కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. 20వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశపడితే.. కేవలం 7వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తునే ఉన్నదని విమర్శించారు.
సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. 20వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశపడితే.. కేవలం 7వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తునే ఉన్నదని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన 7వేల ఉద్యోగాల పోలీస్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా గురువారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపిన నిరుద్యోగులు..
‘మేధావుల్లారా మీరెక్కడ? నిరుద్యోగుల కన్నీళ్లు కనిపించడం లేదా?, 20వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి,46, 29జీఓలను రద్దు చేయాలి.. వంటి నినాదాలతో హోరెత్తించారు. తమ డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 5న ‘హలో నిరుద్యోగి చలో అశోక్‌నగర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఆరోజు ఉదయం 10 గంటలకు అశోక్‌నగర్ నుంచి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు వెల్లడించారు. కాగా, నిరసన తెలిపిన పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి..పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

