– తుంగతుర్తి ఎంపీడీవోకి విద్యార్థుల వినతి
తుంగతుర్తి, సెప్టెంబర్ 21 : కాలేజీ సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం తుంగతుర్తి కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవో చలపతికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కాలేజీ సమయానికి బస్సులు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆటోలను ఆశ్రయించి కాలేజీకి వస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం కాలేజీ సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపాల్ రాజమోహన్, క్లర్క్ భూమయ్య పాల్గొన్నారు.