KTR | రామగుండంలో గులాబీ జెండా ఎగరాలి.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
- సింగరేణి కార్మిక గర్జన విజయవంతంపై వ్యాల్ల హరీష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు
KTR | గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న రోజుల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్‌ను మంగళవారం కలిసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డిని, రామగుండంలో ఇటీవల నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల పరిరక్షణ కోసం నిర్వహించిన కార్యక్రమంలో హరీష్ రెడ్డి పోషించిన పాత్రను ప్రశంసించారు.
ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Godavarikhani
- KTR
- Pink flag
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

