veenavanka | వీణవంక, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టబోయే లక్ష కిలోమీటర్ల రథ యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ కోరారు.
మండల కేంద్రంలో రథ యాత్ర కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా రథ యాత్రను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 10 వేల కార్లతో బహిరంగ సభతో రథ యాత్ర ప్రారంభ మవుతుందని చెప్పారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, సమాజం, కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు అందరూ హాజరై ఈ రథ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కుమార్, అనిల్, సదానందం, వినయ్, రాజు, పృథ్వీరాజ్, రవికిరణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.