సిరిసిల్ల టౌన్, ఆగస్టు 15: సిరిసిల్లలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను రెండుసార్లు ఎగురవేసి అవమానించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులంతా గీతాలాపన చేస్తున్న క్రమంలోనే ముడి సరిగ్గా లేదని కొందరు జెండాను కిందికి దించారు.
అప్పటికే జాతీయ గీతాలాపన సగం పూర్తి కాగా.. రెండో సారి జెండాను ఎగరవేసి తిరిగి మరోసారి జనగనమణ ఆలపించారు. అయితే రెండు సార్లు జెండా ఎగురవేయడం, రెండుసార్లు జాతీయ గీతాలాపన చేయడంపై దేశభక్తులు మండిపడుతున్నారు.