Pegadapally | పెగడపల్లి : వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా బాధ్యు డుడాక్టర్ భీమనాతిని శంకర్ పేర్కొన్నారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 పూర్తి చేసుకున్న సందర్భంగా విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. హిందువులలో ఐక్యతను పెంచేందుకే సంఘం పారదర్శకంగా పని చేస్తుందని, ప్రపంచంలో వివిధ మతాలను సమన్వయం చేసే శక్తి హిందుత్వానికి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేర్గు శ్రీనివాస్, సభ్యులు రాజేశం, పార్థసారథి, నర్సింహరెడ్డి, గంగాధర్, లక్ష్మణ్, రమేశ్, మల్లారెడ్డి, సంపత్, రాజశేఖర్, శ్రీను, మహెందర్, మల్లేశం, మహెష్, రాంకిషన్ తదితరులున్నారు.