Rekonda | చిగురుమామిడి, ఏప్రిల్ 13: మండలంలోని రేకొండ గ్రామంలో వందలాది ఎకరాలు ప్రజల కోసం భూదానం చేసిన వెలిమల మదన్మోహన్ రావు (74) అనారోగ్యంతో హైదరాబాదులోని తమ సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు. 1977లో హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఆయన గ్రామంలో మొదటి ఎంబీబీఎస్ డాక్టర్ గా గుర్తింపు పొందాడు. అవివాహితుడిగా ఉంటూ గ్రామంలో అందరితో మమేకమై ప్రజలమన్నలు పొందాడు. గ్రామంలోనే సంవత్సరం క్రితం వరకు ఉన్నారు.
బీసీ కాలనీ, ఎస్సీ, వడ్డెర కాలనీ తోపాటు గ్రామపంచాయతీ భవనానికి, పాలకేంద్రం, స్మశాన వాటిక, నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం కు సొంత స్థలాన్ని వందలాది ఎకరాల భూమిని ప్రజల కోసం దానంగా ఇచ్చాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడడంతో వారి సోదరులు డాక్టర్ రత్నకుమారి, శారదా దేవి హైదరాబాద్ లోని తమ నివాసంలోనే వైద్య సేవలు అందించారు. కాగా శనివారం మృతి చెందడంతో హైదరాబాదులోని అంబర్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
విషయం తెలిసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. గ్రామంలోని అన్ని కుల సంఘాలు తోపాటు సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, వివిధ పార్టీల నాయకులు దుడ్డేల లక్ష్మీనారాయణ, బోయిని అశోక్, చాడ శ్రీధర్ రెడ్డి, మామిడి అంజయ్య, పిట్టల రజిత, కృష్ణ మోహన్ రావు, ఇంద్రసేనారావు, సాయిని వెంకటేశ్వర్లు, గణేష్ బాబు తోపాటు పలువురు మదన్మోహన్రావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.