peddapally | పెంచిన నిత్యవసర సరుకులు, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.. సీపీఐ జిల్లా కార్యదర్శి టీ సదానందం
సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు.
peddapally |పెద్దపల్లి టౌన్, మార్చి 16 : సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రం లో కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడారు. సామ్రాజ్యవాద అమెరికా అధ్యక్షుడు ట్రంపు రక్తం మరిగిన అడవి జంతువులాగా ప్రవర్తిస్తూ తమ చేతిలో ఇజ్రాయిల్ దేశాన్ని కీలుబొమ్మలాగా ఆడిస్తూ ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇరాన్ పై యుద్ధం ప్రకటించి వేలాదిమందిని బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని, యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు నష్టపోతారని, లక్షలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతారని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాలను యుద్ధం ద్వారా పరిష్కరించడానికి పోతే అంతర్జాతీయ శాంతికి ముప్పు వాటిల్లుతుందని సమస్యల పరిష్కారానికి చర్చలు పరస్పర గౌరవం ఉన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలోని కార్మిక వర్గం, సామ్రాజ్యవాద శక్తులు, శాంతి ప్రియులు ఐక్యంగా గలం వినిపించాలన్నారు.
ఇరాన్ పై యుద్ధం జరుగుతుంటే దేశ ప్రధాని మోడీ నేతృత్వంలో భారత విదేశాంగ విధానంలో లోతైన సంక్షోభాన్ని ప్రతిబింభిస్తోందని మండిపడ్డారు. డోనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన అనుమతి, సమయపాలనకు లోబడి రష్యా భారతదేశం యొక్క చమురు వాణిజ్యం అవమానకరమైన పరిస్థితి, వాషింగ్టన్ నుంచి వచ్చే ఒత్తిడి కి ప్రభుత్వం తలవంచడం ద్వారా దేశ సార్వబౌమత్వ నిర్ణయాధికారంలో రాజీ పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, కే కనకరాజు. మణికొండ ఓదెమ్మ, మార్కాపూరి సూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

