Karimnagar | కమాన్ చౌరస్తా, జనవరి 19 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం ప్రాంగణంలోని వేంకటేశ్వర, ఆయ్యప్ప, శివాలయాల్లో హుండీలను లెక్కించగా రూ. 2,51,490 ఆదాయం సమకూరినట్లు ఈవో కే కాంతారెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు హుండీలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు పాము సత్యనారాయణ పర్యవేక్షణ లెక్కించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఆర్చకులు మంగళంపల్లి రాజేశ్వర శర్మ, డింగరి చాణక్య, శ్రీనివాస్, మూర్తి, సిబ్బంది శ్రీనివాస్, సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.