Mahila Congress | జగిత్యాల, జూన్ 17 : రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల జిల్లా ఇంచార్జి సుగుణ రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా ఆదేశాల మేరకు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు సూచనల మేరకు మహిళా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా శాఖ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మహిళా కాంగ్రెస్ పనితీరును అడిగి తెలుసుకొని, నివేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా సుగుణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో పాటుగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్ళి ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక కృషి చెయ్యాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమలత, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళాకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి శోభరాణి, గోపి మాధవి, అల్లాల సరిత,సరళ, పిప్పరి అనిత, మమత, సిరికొండ పద్మ, అచ్చ లావణ్య, చిట్ల లత సులోచన, మ్యాదరి లక్ష్మి, కొండ్రా విజయలక్ష్మి పాల్గొన్నారు.