వదలని వర్షం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని ఆగం చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలం, పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, మండలాల్లో కురిసిన వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడంగడ్ల వాన
- పలుచోట్ల దెబ్బతిన్న పంటలు
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఉమ్మడి జిల్లాను వర్షం వదలడం లేదు. ఇప్పటికే నెలరోజుల్లో నాలుగైదుసార్లు కురిసిన వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన అతలాకుతలం చేసింది. వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నగా, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడికాయలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లిలో గొర్రెలకాపరి పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాడు. – నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 30
రాజన్న సిరిసిల్ల/ కరీంనగర్ (నమస్తే తెలంగాణ)/ ఓదెల ఏప్రిల్ 30: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని ఆగం చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, ముస్తాబాద్, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, తంగళ్లపల్లి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలం, పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్, మండలాల్లో కురిసిన వర్షంతో కోతకొచ్చిన వరి దెబ్బతిన్నది.
మామిడిపండ్లు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. పలు గ్రామాల్లో స్తంభాలు కూలిపోవడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడ్డది. ఈదురుగాలులతో ఓదెల మండలంలోని గుండ్లపల్లిలో ఓ ఇంటి రేకులు లేచిపోయాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

