పెగడపల్లి, ఏప్రిల్ 14 : ఓవైపు వరి కోతలు ముమ్మరమవుతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. కానీ, కొనుగోళ్లు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుండగా, కేంద్రాలు ధాన్యపు రాశులతో నిండిపోతున్నాయి. కేంద్రాలను ఇంతవరకు ప్రారంభించక పోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై వడ్లు పోస్తున్నారు.
పెగడపల్లి మండలంలో సుమారు 21వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.