strengthen women | కోరుట్ల, జూన్ 21: మహిళా సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, ఫుడ్ పేస్టివల్ ద్వారా మహిళ సంఘాల సభ్యులు తమ ఉత్పత్తులు విక్రయించి ఆదాయాన్ని పొందుతారని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మెప్మా అధ్వర్యంలో వీది ఆహర ఉత్సవం పేరుతో ఫుడ్ పెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈమేరకు మహిళ సంఘాల సభ్యురాళ్లు తయారు చేసిన వివిధ వంటకాలు, ఆహర పదార్థాలను ప్రదర్శించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళ సంఘాల సభ్యులు ఆర్ధికంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో మెప్మా టీఎంసీ శ్రీరామ్ గౌడ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు మహేష్, వార్డు ఆఫీసర్ మహమూద్, మహిళ సంఘాల సభ్యురాళ్లు, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.