MLA Sanjay Kumar | జగిత్యాల : మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినందున బుధవారం మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు 6680కోట్ల ప్రయాణ ఛార్జీలు అదా చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎం కల్పన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య ప్రవీణ్, నాయకులు అడువల లక్ష్మణ్, సుధాకర్ రావు, చేట్పల్లి సుధాకర్, వేణు, శరత్ రావు, పోతునుక మహేష్, రంగు మహేష్, ప్రవీణ్ రావు, సత్తవ్వ, సంకే మహేష్, హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.