support dairy farmers | సారంగాపూర్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా ప్రతీ లీటర్కు రూ.5 ప్రోత్సాహకంగా అందించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో పాడి పరిశ్రమను సోమవారం పరిశీలించి వివరాలు తెల్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రైతాంగానికి రూ.2లక్షలు రుణమాఫీ, రైతు భరోసా, సన్న రకాలకు రూ.500 బోనస్ అందిస్తుందన్నారు.
అదే విధంగా వ్యవసాయంలో భాగమైన పాడి రైతులకు కూడా పాల ఉత్పత్తిలో ప్రతీ లీటర్ కు రూ.5 ప్రోత్సకంగా ప్రభుత్వం అందించాలని సూచించారు. స్థానికంగా పాల సేకరణ ధర తగ్గింపునకు ఇతర రాష్ట్రల నుండి ఇబ్బడి ముబ్బడిగా ప్యాకెట్ల రూపంలో మన వద్ద ఉత్పత్తుల కన్న తక్కువ ధరకు సరాఫరా చేయడంతో మర్కెట్లో మన ఉత్పత్తిదారుకు తట్టుకోలేక పాల ఉత్పత్తి రైతులకు ప్రొక్యూర్మెంట్ ధర తగ్గించటం అవుతుందన్నారు. ఇతర రాష్ట్రల నుండి సరాఫరా చేయబడే పాలలోని కల్తీని నివారించాలని, దీని కోసం ఇతర రాష్ట్రల నుండి వచ్చే పాల ట్రాన్స్పోర్ట్ రవాణపై నిఘాను ఉంచి ఎక్కడికక్కడ చెకింగ్ పరీక్షలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని రైతాంగానికి, వ్యవసాయానికి అనుబంధంగా సంక్షోభంలో ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్లు పాల ఉత్పత్తిదారులకు ప్రతి లీటర్ పై రూ.5 పోత్సహకం కల్పించాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పాల కల్తీ నివారణకు పటిష్టమైన ఫుడ్ ఆడట్రేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసి కల్తీని అరికట్టలని పాల ఉత్పత్తి దారులను ఆదుకోవాలని ప్రభుతాన్ని కోరారు.
ఈ విషయమై పాడి రైతులను అదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, వాకిటి శ్రీహరిలకు సోమవారం మాజీ మంత్రి ఉత్తరాలు రాసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర రాంచందర్ రెడ్డి, ఆకుల రాజిరెడ్డి, కొక్కు గంగారాం, ఉవేందర్, చేకూట శేఖర్, రాఖీ, సత్యనారాయణ రెడ్డి, శేఖర్, సుభాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.