Bharatiya Kisan Sangh | మల్లాపూర్, అక్టోబర్ 30 : కురుస్తున్న భారీ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి అన్నారు. ఆ సంఘం నాయకులతో కలిసి రైతులను సమస్యలను పరిష్కారించాలని కోరుతూ తహసీల్దార్ రమేష్ గౌడ్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ధాన్యం తూకం వేసి ఎలాంటి కటింగులు లేకుండా రైతులకు డబ్బులను అందిచాలని డిమాండ్ చేశారు.
అలాగే జిల్లా వ్యాప్తంగా చాలా మంది రైతులకు ఇప్పటికీ గత సీజన్ సన్నపు వడ్లకు బోనాస్ డబ్బులు రాలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్‌రెడ్డి, నాయకులు పోశంపల్లి రమేష్ రెడ్డి, మొరపు గంగరాజం, గడ్డం మల్లారెడ్డి, నల్ల భూమారెడ్డి, పోశంపల్లి రాజేందర్, మామిడి నరేష్, ఏనుగు ఆనంద్రరెడ్డి, మొరపు జలపతి తదితరులు పాల్గొన్నారు.