Enugu Manohar Reddy | వేములవాడ రూరల్, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మనో రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సమన్వయం పాటించాలని, ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కావని అన్నారు.
శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడే సమ్మెను విరమింప చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగి కళ్లు తిరిగి పడిపోగా ఆస్పత్రికి తరలించగా బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్ శ్రీనివాస్ శ్రీకాంత్ గౌడ్ క్రాంతి కుమార్ కనకయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.