Sircilla | సిరిసిల్ల రూరల్, జూలై 25: సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తంగళ్లపల్లి సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిలో తన మనోగతం వెల్లడించారు. తంగళ్లపల్లి మండల నుంచి సెస్ డైరెక్టర్ గా నిలిచి, సెస్ చైర్మన్ గా ఎన్నికయ్యాయని పేర్కొన్నారు.
చైర్మన్ గా ఎన్నికయ్యకా పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా వెళ్లలేకపోతున్న. సోసైటీ చైర్మన్ గా ఉన్న పార్టీలకతీతంగా ఉంటున్నానని, వినియోగదారులకు సేవకే కేటాయిస్తున్నానని, సంస్థ అభివృద్ధికి పాలకవర్గం అంతా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తంగళ్లపల్లి మండలంలో అనుకున్న పనుల్లో 50 శాతం వరకు పూర్తి చేశామన్నారు. లూజు వైర్లు, పాత ట్రాన్సఫార్మర్ల ప్లేసులో కొత్త ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. పాత నుప స్థంభాల్లో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తంగళ్లపల్లి సబ్ డివిజన్ ఏర్పాటు చేశామని, తంగళ్లపల్లి మండల కేంద్రంలో సబ్ డివిజన్ కార్యాలయాన్ని అద్దె భవనంలో ఏర్పాటు చేసి, కొనసాగిస్తున్నామన్నారు.
సొంత భవనం కోసం స్థలం కోసం గత ప్రభుత్వంలోనే దరఖాస్తు చేశామని, పెండింగ్లో ఉందన్నారు. తర్వాత స్థలం కేటాయించడం జరగలేదన్నారు. ప్రభుత్వం స్థలం సేకరిస్తే, 15 గుంటల్లో సబ్ డివిజన్ కార్యాలయం నూతన భవనంను నిర్మాణం చేస్తామన్నారు. ప్రభుత్వ భూమి కేటాయించకపోవడంతో బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్క్ 15 గుంటల స్థలం కోసం రెండు నెలల క్రితం టెక్స్టైల్ శాఖకు ప్రతిపాదనలు, నివేదిక అందించామన్నారు. టెక్స్టైల్ ఫార్క్ స్థలం కేటాయిస్తే రూ.1.20 కోట్లతో భవనం నిర్మాణం చేస్తామన్నారు. ఇందుకు డిజైన్లను సైతం రూపోందించామన్నారు. స్థలం కేటాయిస్తే, స్థలానికి డబ్బులు చెల్లించి, భవనం నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. సబ్ డివిజన్ సొంత భవన నిర్మాణం చేస్తే సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాలలోని వినియోగదారులకు అందుబాటులో సేవలు అందించడంసాధ్యమవుతుందన్నారు.
టెక్స్టైల్ పార్క్ సబ్ డివిజన్ భవనం ఏర్పాటు చేస్తే, పరిశ్రమలకు, రైతులకు, వినియోగదారులకు సేవలు మరింత మెరుగ్గా అందించవచ్చన్నారు. తంగళ్లపల్లి సబ్ డివిజన్లో పనిచేస్తున్న సెస్ అధికారులు, ఎఈలు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ గజభీంకార్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్, సెస్ సిబ్బంది ఉన్నారు.