MLA Vijayaramana Rao | పెద్దపల్లి, జూన్ 5(నమస్తే తెలంగాణ): మహిళల ఆర్థికాభివేద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, రోగుల బంధువుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను వినియోగించుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిలా ఆసుపత్రి ఎం సీ హెచ్ లో ఇందిరా మహిళా శక్తి గ్రూపుకి కేటాయించిన క్యాంటిన్ ను స్థానిక నాయకులతో, ఆసుపత్రి అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా ఆసుపత్రి కి వచ్చి వెళ్లే ప్రజల కోసం, రోగుల కోసం ప్రభుత్వ ప్రోత్సహంతొని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతొని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా క్యాంటిన్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మహిళలకు జీవనోపాధి కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పధకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.
మహిళా గ్రూపుల ద్వారా మహిళలకు సేవా చేసే అవకాశం రావడం చాలా గర్వకారణం అన్నారు. అందరి సహకారంతో ఈ మహిళా క్యాంటిన్ ముందు ముందు కూడా మంచి పురోగతి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఉప్పు రాజు, బొంకురి అవినాష్, జడల సురేందర్, దొడ్డుపల్లి జగదీష్, ఆసుపత్రి జిల్లా సూపరింటెండెంట్ కొండా శ్రీధర్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.