welfare schemes | పెద్దపల్లి రూరల్, జూలై 28 : అర్హులై పేద వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, ముత్తారం, ధర్మాబాద్ గ్రామాల్లో రూ.99లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోశారు. ఐకేపీ మహిళా సంఘాల కోసం నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విదంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ , ఐకేపీ ఏపీఎం సంపత్ కుమార్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురెందర్ , సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నర్సింహరెడ్డి, సందనవేని రాజేందర్ యాదవ్ , కొమ్ము శ్రీనివాస్ పటేల్ , పోసాని మల్లేష్ యాదవ్ , యేడెల్లి శంకర్ పటేల్, కలబోయిన మహేందర్, కొమ్ము సత్యం పటేల్, కొమ్ము కరుణాకర్ పటేల్, ఎద్దు కుమారస్వామి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.