Julapalli | జూలపల్లి, జనవరి 3 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల దాకా దట్టమైన పొగ మంచు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లె సీమలు ఊటీలా తలపించాయి.
రహదారులపై ఎదురెదురుగా వచ్చే వాహనాలు కల్పించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నెమ్మదిగా నడుపుతూ ముందుకెళ్లారు. పొగ మంచుతోపాటు తీవ్ర చలితో అవస్థలు పడ్డారు. పొద్దెక్కిన సూర్యోదయం లేకపోవడంతో జనం చలి దుప్పట్లు, స్వెటర్లు వదలలేదు.