కరీంనగర్ కమాన్ చౌరస్తా, డిసెంబర్ 15 : గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు సెషన్లలో కొనసాగాయి. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే లోనికి అనుమతించారు. అయితే కొందరు ఆలస్యంగా రాగా, అనుమతించలేదు. మరికొందరు మధ్యాహ్నం పరీక్షకు హాజరు కాలేదు. నేడు కూడా మొదటి రోజు వేళల్లోనే పరీక్షలు ఉండనుండగా, అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, టీజీపీఎస్సీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.