MLA Padi Kaushik Reddy | హుజూరాబాద్ టౌన్, జూలై 5 : కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ప్రతీ ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చేంత వరకు తన పోరాటం ఆగదని, ప్రశ్నిస్తూనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలకు చెందిన 158 కళ్యాణ లక్ష్మీ ప్రపోజల్స్ శనివారం పంపినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీడియో సందేశం ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం రూ.లక్షా నూట పదహార్లతో పాటు, తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ 158 మంది లబ్ధిదారులతో పాటు ఇప్పటివరకు చెక్కులు అందించిన వారికి సైతం తులం బంగారం ఇవ్వాలన్నారు.