Chalmeda Lakshmi Narasimha Rao, Siricilla | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.
- వెయ్యి రోజుల పరిపాలన గడుస్తున్న హామీలకు దిక్కేలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు
Chalmeda Lakshmi Narasimha Rao, Siricilla | వేములవాడ, ఆగస్టు 29 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. అధికారంలోకి రాకముందు వంద రోజులలో అమలు చేస్తామన్న 420 హామీలు వెయ్యి రోజులు పరిపాలన గడుస్తున్న ప్రజలకు అందివ్వడంలో విఫలమైనందున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా శనివారం నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యా లపై పోరుబాట చేద్దామని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాకముందు 420 హామీలు ప్రకటించి వంద రోజులలో అమలు చేస్తామని మోసపూరితమైన పరిపాలన అందిస్తూ వెయ్యి రోజులు గడుస్తున్న అమలు చేయకపోవడాన్ని క్షేత్రస్థాయిలో నిలదీయాలని అన్నారు.
వైఫల్యాలతో పాటు అవినీతి అక్రమాలను కూడా ప్రశ్నించాలని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట చేపడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండలాల అధ్యక్షులు మల్యాల దేవయ్య, మ్యాకల ఎల్లయ్య, గోసుకుల రవి, సీనియర్ నాయకులు మ్యాకల రవి, మామిడిపల్లి రవికుమార్, నిజయోజకవర్గంలోని సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

