NREGS | సారంగాపూర్, ఆగస్టు 21 : సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనుల జాతరను విజయవంతం చేయాలని ఎంపీడీవోలు చౌడారపు గంగాధర్, భీమేష్ అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం ఆయా మండల పరిషత్ కార్యలయాల్లో ఉపాధి పనుల జాతర, వివిధ అంశాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించే ఉపాధి పనుల జాతరలో ఉపాధి హామీ ద్వారా చేపట్టే సీసీరోడ్లు నిర్మాణాలు, జీపీ భవనాలు, అంగన్వాడి సెంటర్ల నిర్మాణాలు, వ్యక్తిగత లబ్దిదారులకు ఉపయోగపడే బర్ల షెడ్లు, గొర్ల షెడ్ల నిర్మాణాలు, కంపోస్ట్ ఫిట్లు, అజోల్లా పెంపకం, చిన్న ఫాల్జిఫారాలు నిర్మాణం, మొదలగు పనులు చేపట్టడడం జరుగుతందన్నారు.
ఆయా గ్రామాల్లో ఈ పనులను గుర్తించడం, మంజూరైన వాటికి ముగులు పోయడం, ఉపాధిహామీ పనుల్లో ఎక్కువ రోజులు పనులు చేసిన వారిని, మల్టీపర్సస్ వర్కర్స్ ను గుర్తించి సన్మానిస్తామని చెప్పారు. అలాగే ఉపాధి హామీ పనుల నిర్వహణ, పీఎంవై నమోదు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు తదితరు అంశాలపై సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో ఏపీవోలు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.