ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంపై సంస్థ ఉద్యోగులు రాత్రి సంబురాలు జరుపుకున్నారు. కరీంనగర్ డిపో-1, 2 ఎదుట బ్యాండ్‌మేళాలు వాయిస్తూ నృత్యం చేశారు. ‘కేసీఆర్ జిందాబాద్’, ‘లాంగ్‌లివ్ కేసీఆర్’ అంటూ నినదించారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ర్యాలీగా బస్టాండ్ ఆవరణలో కలియతిరిగారు.
– తెలంగాణచౌక్, ఆగస్టు 6
తెలంగాణచౌక్,ఆగసు 6: ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం బిల్లుకు అసెంబ్లీలో అదివారం ఆమోదం పొందడంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి కరీంనగర్ ఆర్టీసీ1, 2 డిపోల వద్ద సంబురాలు జరుపుకున్నారు. బ్యాం డ్ మేళా మధ్య నృ త్యాలతో హోరెత్తించారు. ప టాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. కేసీఆర్ జి దాంబాద్ అంటూ నినాదాలు చేశారు. పటాకు లు కాల్చారు. లాంగ్‌లీవ్ కేసీఆర్ అని నినాదాలు చేశా రు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు మ నోహర్, నారాయణ చంద్రారెడ్డి, ఎంఎస్‌రెడ్డి, డ్రైవర్లు,కండక్టర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.
కేసీఆర్ మా పాలిట దేవుడు
మా కష్టాలను గుర్తించి మమ్ములను ప్రభు త్వ ఉద్యోగులుగా మార్చిన సీఎం కేసీఆర్ మా కు దే వుడితో సమానం. జీవితంలో మేము ప్రభుత్వ ఉద్యోగులం అవుతామని ఊహించ లేదు. బిల్లు ను గవర్నర్ అపారని తెలిసి ఆందోళన చెందాం. కానీ మాట ఇచ్చిన కేసీఆర్ ఎలాగైనా బిల్లును అమోదింప చేస్తారనే న మ్మకం ఉంది. ఎంతో ఉత్కంఠ మధ్య బిల్లు అసెంబ్లీ లో ఆమోదిండం సంతోషంగా ఉంది. సర్కారుకు జీవితాంతం రుణ పడి ఉంటాం.
– శశిరేఖ కండక్టర్ (డిపో-1 కరీంనగర్ )
కల నెరవేర్చిన సర్కారుకు కృతజ్ఞతలు
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరింది. తెలంగాణ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞత లు. గత పాలకుల మమ్ములను పట్టించుకున్న దాఖాలాలు లేవు. వెట్టిచాకిరీ చేసినం. మాకు మంచి రోజులు వస్తాయని ఇంతకాలం ఎదురు చూశాం. సీఎం కేసీఆర్ రూపంలో అదృష్టం వ చ్చింది. మా పిలల్ల భవిష్యత్ బాగు పడుతుం ది. కార్మికుల శ్రేయస్సు కోరే నాయకుడిగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం కేసీఆర్ ధన్యావాదాలు.
-లక్ష్మీరాజం మెకానిక్, (కరీంనగర్ డిపో-1)
ఎంతో సంతోషంగా ఉన్నది..
కార్మికుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది కలా..నిజమా అన్ని నమ్మలేకపోతున్నం. గవర్నర్ బిల్లు అపారని తెలిసి బాధపడ్డాం. కానీ సీఎం కేసీఆర్ పట్టుదలతో బిల్లు ను ఆమోదింప జేశారు. మాకు ఎంతోసంతోషంగా ఉంది. ఎం దరో నాయకులను చూశాం కానీ ప్రజల శ్రేయ స్సు కోసమే పని చేసే నాయకుడు కేసీఆర్. ఆయన సీఎంగా ఉండడం మా అదృష్టం.
-రమేశ్ -కండక్టర్ (కరీంనగర్ డిపో-2)
జీవితాంతం రుణపడి ఉంటం..
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల భద్రత గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. ఆర్టీసీ ని కాపాడుకుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ సం స్థను ప్రభుత్వంలోకి తీసుకున్నా రు. దీంతో ఏ న్నో ఏళ్లుగా ఆర్టీసీకి సేవలందిస్తున్న కార్మికులు, ఉద్యోగులు, సి బ్బందికి మేలు జరిగింది. సీఎం కేసీఆర్ తీ సుకున్న ఈ నిర్ణయం కలలో కూడా ఊహించనిది. ఆయనకు కార్మికులందరూ జీవితాం రుణపడి ఉంటారు.
-గంధం, రాజేందర్ మెకానిక్ (ఖని డిపో)