GandiLachhapet | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామపంచాయతీ పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అన్నల కోటగా పేరొచ్చినా గండిలచ్చ పేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామం లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఆదివారం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. సర్పంచ్‌గా జంగిటి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులు బల్లేపు ప్రశాంత్, పుట్ట దేవరాజు, పుట్ట భాను, భామగారి వజ్రవ్వ, కుక్కల ఉమ, చదల సుమన్, బీపేట రేణుక, అనరాశి జలంధర్ ఎన్నికయ్యారు. అదే విధంగా 3 వార్డు సభ్యుడు పుట్ట భాను ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజయ్య, ఉప సర్పంచ్ భాను, వార్డు సభ్యులను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అభినందించి, పూల మాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ సర్పంచ్ల పోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, మండల అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ రావు, పడిగెల రాజు, కందుకూరి రామగౌడ్, పార్టీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.