అంతర్గాం, మార్చి 15: దశాబ్దాల కాలంగా పేదవారు ఎదురుచూస్తున్న పట్టాల కల సీఎం కేసీఆర్ ద్వారా సాకారమైయింది. తమ నివాసాలకు పట్టాలియ్యాలని పేదవారు యాభై ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వారి కలను సాకారం చేసింది. వారి నిరీక్షణకు తెరదించింది. ప్రభుత్వ భూముల్లో 165 చదరపు గజాల లోపు నివాసాలకు పట్టాచేసింది. జీవో 58ను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 15ఇండ్లకు పట్టాలు మం జూరు చేసింది. ఈ క్రమంలో అంతర్గాం మం డ లం బ్రాహ్మణపల్లి లంబాడి తండాలో 11 ఇళ్ల కు, అంతర్గాం టీటీఎస్లో 4 నివాసాలకు ప్రభు త్వం ద్వారా యాజమాన్యపు హక్కతో కుడిన పట్టాలు మాంజారయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం బ్రాహ్మణపల్లి లంబాడితండా ప్రభు త్వ పాఠశాలలో, అంతర్గాం టీటీఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. పట్టాలు అందుకున్న వారు మాట్లాడుతూ 60 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురు చేస్తున్నామని, తమ కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంటింటికీ సంక్షేమం, ప్రతి ముఖంలో అనందం నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దశాబ్ధాల పేద వారి కలను సాకా రం చేసిన మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. 60ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కలను సీఎం కేసీఆర్ 58జీవో అమలు చేసి సాకారం చేశారన్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలకు యాజమాన్య హక్కులతో కూడిన పట్టాను పేదవారికి అందించామన్నారు. మన సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలంతా అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో అం తర్గాం ఎంపీపీ దుర్గం విజయ, సర్పంచ్లు బండారి ప్రవీన్, కుర్ర వెంకటమ్మ నూకరాజు, తుంగపిండి సతీశ్, అంతర్గాం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతినాయక్ పాల్గొన్నారు.
50 ఏండ్ల కింద మా తల్లిదండ్రులు ఇక్కడి వచ్చిండ్రు. ఇల్లు కట్టుకొని కూలి పని చేసుకుని బతుకుతున్నం. మా ఇండ్లకు పట్టాలు కావాల్నని ఎన్నో సార్లు, ఎందరో సార్లను అడిగినం గనీ ఎవరూ పట్టించుకోలె. కానీ సీఎం కేసీఆర్ సారు, మా ఎమ్మెల్యే చందరన్న దయతో మా ఇండ్లకు పట్టాలచ్చినయ్. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– వీ గట్టమయ్మ, బ్రాహ్మణపల్లి (లంబాడీతండా)
ఎన్నో ఏండ్ల సంది ఇండ్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నం. మా తండ్రుల కాలం నుంచి ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నం. ఎందరినో అడిగినం. ఎక్కడెక్కడికో తిరిగినం గనీ లాభం లేకుంటవోయింది. ఎవరు గూడ మమ్మల్ని పట్టించుకోలె. పట్టా ఇయ్యలె. కానీ సీఎం కేసీఆర్ మా ఇండ్లకు పట్టాలిచ్చిండు. మాకు చాన సంతోషమైంది. ఆ సారుకు గూడ మేం ఎప్పుడూ అండగ ఉంటం.
– అజ్మీరా రవి, బ్రాహ్మణపల్లి (లంబాడీతండా)
60 ఏండ్ల సంది ఇండ్ల పట్టా చెయ్యిండ్రని అందరి కాడికి వోయినం. ఎవరు పట్టించుకోలె. ఇక మాకు పట్టా రాదనుకున్నం. మత్తు రందయింది పట్టా లేకుంటె ఎట్లని. కానీ సీఎం కేసీఆర్ సారు, ఎమ్మెల్యే చందరన్న వల్ల పట్టాలు అచ్చినయ్. కేసీఆర్ సారు సల్లగుండాలె.
– వీ శాంతమ్మ, బ్రాహ్మణపల్లి (లంబాడీతండా)