prestige in sports | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 25 : క్రీడా పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా తమ ప్రతిభను చాటి పెద్దపల్లి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి క్రీడా పోటీలను జిల్లా విద్యాధికారి జెండా ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో క్రీడలకు సంబంధించిన పలు విషయాలను వివరిస్తూ క్రీఢాకారులందరు కూడా మంచి ప్రతిభను చూపి భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నారు.
పిల్లలకు చదువుతోపాటు క్రీడలలో ప్రావీణ్యం వల్ల శారీరక మానసిక వికాసం చెంది చదువుల్లో కూడా బాగా రాణించగలుగుతారని, పిల్లలందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని భవిష్యత్లో అన్ని రకాల క్రీడల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి మండల స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించనున్నామని, ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సురేందర్ కుమార్, అప్పన్నపేట జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, మండలంలోని వివిధ పాఠశాలల పీఈటీలు, 18 పాఠశాలల క్రీడాకారులు, జెడ్పీ హెచ్ఎస్ అప్పన్నపేట పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ వేల్పుల సురేందర్, శైలజ, ఉపాధ్యాయులు, పలు పాఠశాలల పీఏటీలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.