లక్ష్యానికి చేరువలో పన్నుల వసూళ్లు
ఇంటి పన్నులు, పన్నేతల వసూళ్లలో జిల్లా లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం పన్నుల లక్ష్యం రూ.10,04,68130 ఉండగా, నేటి వరకు రూ. 9,70,15,777 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూలు ఇప్పటికీ 96.56 శాతం పూర్తయింది.
- జిల్లాలో 96.56 శాతం పూర్తి
- పన్ను, పన్నేతర లక్ష్యం రూ.10.46 కోట్లు
- నేటి వరకు వసూళ్లయిన మొత్తం రూ. 9.70 కోట్లు
- ఈనెల చివరలోగా వంద శాతం వసూలే లక్ష్యంగా అడుగులు
రాయికల్, మార్చి 17: ఇంటి పన్నులు, పన్నేతల వసూళ్లలో జిల్లా లక్ష్యానికి చేరువలో ఉంది. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం పన్నుల లక్ష్యం రూ.10,04,68130 ఉండగా, నేటి వరకు రూ. 9,70,15,777 కోట్లు వసూలు చేశారు. పన్నుల వసూలు ఇప్పటికీ 96.56 శాతం పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో కొన్నిరోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పన్నుల వసూళ్లను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈనెల 31వ తేదీలోగా ప్రతి గ్రామంలో వందశాతం పన్నులు వ సూలు చేస్తామని అధికారులు పేరొంటున్నారు.
జిల్లాలో 18 మండలాలుండగా, 380 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ గ్రామానికి అధికారులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను ల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో మొ త్తం లక్ష్యం రూ.10,04,68,130 కోట్లు కాగా ఇందులో ఇంటి పన్నుల లక్ష్యం రూ.7,62,18, 006, పన్నేతర పద్దుల కిందికి వచ్చే నల్లా, వివిధ ర కాల సర్టిఫికెట్లు, వేలాలు, లై సెన్సుల జారీల రూపంలో రూ.2,42,50,124 వసూలు లక్ష్యాన్ని నిర్దేశించారు. కాగా ఇ ప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అ న్ని రకాల పన్నులు కలిపి రూ. 9,70,15,777 కోట్లు వసూలు చేశారు. ఇప్పటికే 140 గ్రామా ల్లో వందశాతం పన్నుల వసూ ళ్లు జరిగాయి. ప్రతీ గ్రామానికి నిర్దేశించిన పను ల లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలంటూ జిల్లా అధికారులు మండల అధికారులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప న్నుల వసూళ్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ వారానికోసారి మండలాల వారీగా ఇచ్చిన టార్గెట్, పూర్తి చేసిన వసూళ్లపై కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, సంబంధిత అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహిస్తూ వందశాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలు.. నోటీసుల జారీ
2022-23 ఆర్థిక సంవత్సరం మరోకొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో పలు గ్రామాల్లో ప న్నుల వసూళ్ల లక్ష్యానికి అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా వారు పన్నులను వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయి న మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. పన్ను వసూళ్ల్లు తకువగా అవుతున్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా గడువులోగా వంద శాతం పన్నులు వసూల్ చేయాలని బృంద సభ్యులు నిమగ్నమయ్యారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నేండు గంటల వరకు గ్రామాల్లో తిరుగుతూ పన్నులు వసూలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుండి పన్నులు స్వీకరిస్తున్నారు.
మండలాల వారీగా పన్ను వసూళ్ల వివరాలు
జిల్లాలోని మండలాలకు సంబంధించిన పన్నుల లక్ష్యం, ఇప్పటి వరకు వసూలు అయిన పన్నుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెట్పల్లి మండలంలో రూ.1.01 కోట్ల లక్ష్యానికి రూ.కోటి వసూలు చేశారు. మిగతా మండలాల వివరాలు..
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

