Disabled | పెద్దపల్లి రూరల్, జూన్ 21: పెద్దపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కోసం 100 శాతం సబ్సిడీ పై ఉచితంగా అందించేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 27 తేదిని చివరితేదిగా నిర్ణయించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి పి వేణుగోపాల్ రావు తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని దివ్యాంగుల సౌకర్యార్థం సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించిన ఉపకరణాలతో పాటు సాంప్రదాయకమైన ఉపకరణాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో అర్హులైన దివ్యాంగులకు 2025-26 సంవత్సరానికి ఉచితంగా పంపిణీ చేయుటకు తెలంగాణా వికలాంగుల సహకార సంస్థ, హైదరాబాదు వారిచే అందించుటకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా లోని దివ్యాంగులైన వారు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. https://tsobmms.cgg.gov.in// అనే వెబ్ సైట్ ద్వారా ఈ నెల 27 లోపు అన్ని అర్హతలు కల్గిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హులైన వారందరికీ ఉచితంగా 100 శాతం సబ్సిడీపై సహాయ ఉపకరణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
1. (Retrofitted) రెట్రోఫిట్టెడ్ మోటార్ వెహికల్స్
2. బ్యాటరీ వీల్ చైర్స్ (Battery Wheel Chairs)
3. చిరు వ్యాపారులకు మొబైల్ బ్యాటరీ ట్రై సైకిల్ (Mobile Business Battery Trycycles)
4. బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్ (Battery Mini Trading Auto Vehicles)
5. ల్యాప్ టాప్స్ (Laptops)
6. 5G స్మార్ట్ ఫోన్ (5G Smart Phones)
7. టాబ్ (TAB)
8. ట్రై సైకిల్ (Try Cycles)
9. వీల్ చైర్ (Wheel Chair)
10. చంక కర్రలు (Crutches)
11. వినికిడి యంత్రములు (Hearing Aids)
12. అంధుల చేతి కర్రలు (Walking Sticks)
13. అంధుల స్మార్ట్ కెన్ డివైసెస్ ( Smart Canes)
14. ఎం సి ఆర్ చప్పల్ (MCR Chappal) లు అర్హతలను బట్టి అందించబడుతాయని అర్హులైన వారంతా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అర్హులైన దివ్యాంగులు www.tsobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా ఈ నెల 27లోగా అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని, ఇట్టి అవకాశాన్ని అందరు వినియోగించుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్ రావు కోరారు.