హన్మంతునిపేటలో ముగిసిన చిరుతల రామాయణం
PEDDAPALLY | పెద్దపల్లి రూరల్ , మార్చి28 : పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేటలో గత ఐదు రోజులుగా రామాయణం పంతులు రాజేశంగౌడ్ నిర్వహణ కమిటీ బాధ్యులు భయ్య కొమురయ్య యాదవ్ పర్యవేక్షణలో నడుస్తున్న చిరుతల రామాయణం శుక్రవారం శ్రీ సీతారాముల పట్టాభిషేకంతో కనుల పండువగా ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు గ్రామస్తులు ఓడిబియ్యం పోసి వైభవోపేతంగా పట్టాభిషేక ఘట్టాన్ని ముగిస్తూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వేగోళపు సదయ్యగౌడ్ చిరుతల రామాయణ పాత్రదారులను, పంతులును, నిర్వాహకులను అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.