Gift a Smile | సిరిసిల్ల రూరల్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని, గిఫ్ట్ ఏ స్మైల్ కొనసాగించడం హర్షణీయమని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ పంపించిన, కేసీఆర్ కిట్ల ను మహిళలకు అందజేశారు.
పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడారు. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ప్రతీ యేటా మాదిరిగానే సేవ కార్యక్రమాలు నిర్వహించడం సంతోష కరణమన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 7 ఏళ్లుగా లక్షల మంది కి అండగా నిలిచారన్నారు. పుట్టిన రోజును ప్రజలు పండుగ లా జరుపుకుంటారన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలు దీవించాలనీ కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ మండల అధ్యక్షుడు ఆంకారపు రవీందర్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి, వలకొండ వేణుగోపాల్ రావు, మిరాల భాస్కర్ యాదవ్, జక్కుల నాగరాజు యాదవ్, బండి జగన్, ఏసీ రెడ్డి రాంరెడ్డి, కందు కూరీ రామ గౌడ్, అనిల్ గౌడ్, గుండు ప్రేమ్ కుమార్, కొయ్యాడ రమేష్, అమర్ రావు, భానుమూర్తి, తిరుపతి, నవీన్ రావు, గనప శివాజ్యో తి, రోజా, మహిళలు ఉన్నారు.