MS Singh Raj Thakur | జ్యోతినగర్, జూన్ 03: పేద ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని రామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్టీపీసీ ఈడీసీ మిలినీయం హల్లో మంగళవారం రామగుండం నగరపాలక సంస్థ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురోగతిపై ఆదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నగరంలో జరుగుతున్న వందల కోట్ల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మున్సిపల్ వార్డు అధికారులు ప్రజలకు పథకాల అమలు దక్కేటట్లుగా పరిశీలన చేయాలన్నారు.
అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యాచరన ప్రణాళకలో భాగంగా చేపడుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఎమ్మెల్యేకు వివరించిన కమిషనర్ తదనంతరం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం డ్రైయిన్ క్లీనర్లుగా పనిచేస్తున్న 18 మందికి ఆయుష్మాన్ హెల్త్కేర్డులను పంపిణీ చేశారు. ఇక్కడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఈఈ రామన్, ఎస్ఈ శివానందన్, ఏసీపీ శ్రీహరి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహశీల్దార్ దత్తు ప్రసాద శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగ భూషణం, కుమార్, స్కామి కిరణ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, ఎన్టీపీసీ, సింగరేణి అధికారులు ఉన్నారు.