MLA Dr. Sanjay Kumar | జగిత్యాల, ఆగస్టు 14 : రాష్ట్రంలోనే జగిత్యాల పట్టణానికి అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల పట్టణంలో 41, 42, 43 ,46 వార్డులలో రూ.1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులకు గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జగిత్యాల కు మంజూరు చేయటం జరిగిందని వెల్లడించారు. రూ.150 కోట్లతో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధితో పాటు పచ్చదనం పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే పట్టణం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగిందని, అధికారులు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అభివృద్ది పనుల విషయంలో ఆటంకం కలిగించవద్దని, అని ప్రతిపక్షాలను కోరారు. 40 ఇండ్లు కట్టని నాయకులు ఇతర నియోజకవర్గం నుండి ఇక్కడికి వచ్చి 4500 ఇండ్ల మౌలిక వసతులు పై మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రజలు తమ ఇంటి చెత్తను మున్సిపల్ సిబ్బందికి ఇచ్చేముందు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు. తన ఇంటి నుండే తడి, పొడి చెత్త సేకరణ ప్రారంభం కావాలని, చెత్త సేకరణ వేరు చేయకుంటే చెత్త తీసుకోవద్దు అని మున్సిపల్ కార్మికులను కోరారు. ఏదో ఒక సందర్భంలో మార్పు రావాలన్నారు.
డంపింగ్ యార్డు లో ప్రహారీ కి 2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, ఇప్పటి వరకే 5 కోట్ల నిధులు చెత్త శుద్ధికి మంజూరు చేయటం జరిగిందన్నారు. పచ్చదనం పరిశుభ్రత విషయంలో జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అందరిదని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పట్టణం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.పట్టణం అభివృద్ధికి ప్రజలకు సేవలకుగాను ప్రతీ వార్డుకు వార్డు అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. వచ్చే ఎన్నికల కోసం కాదు వచ్చే తరం కోసం పనిచేయాలన్నారు. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. రూ.203 కోట్ల తో నూతన ఆసుపత్రి మంజూరు చేసినట్లు వివరించారు. ప్రజలందరూ మత సామరస్యాన్ని కాపాడాలని, ప్రతీ ఒక్కరూ వారి మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించాలని, హింస అనేది అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మన్సూర్, నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఖాజీం అలీ, కో ఆప్షన్ హసిబొద్దిన్, మాజీ కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్, ఫిర్దోస్ తరుణం, బాలే శంకర్, తోట మల్లికార్జున్, కూతురు పద్మ శేఖర్, కూతురు రాజేశ్, బోడ్ల జగదీశ్,డిష్ జగన్ పంబాల రాము, అహమ్మద్, అంగడి సాయి, ఏ ఓ శ్రీనివాస్ డీఈ ఆనంద్,వరుణ్, ఏఈ శరన్ అనిల్, పెద్దింటి రాజు, దుమాల రాజ్ కుమార్,ఫిరోజ్,జావేద్, జమీల్, లింగారెడ్డి, గంగాధర్, వార్డు ఇంచార్జ్ అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.