Huzurabad | హుజూరాబాద్ రూరల్, జూన్ 11 : జమ్మికుంట ఎంపీఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు సర్ పై నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తాటిపర్తి జీవన్ రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ చిరుముళ్ల రాకేష్ తదితర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు ఇరుమళ్ళ సురేందర్ రెడ్డి, గందె శ్రీనివాస్, కటుకూరి మల్లా రెడ్డి, కొలిపాక శ్రీనివాస్, మొలుగు పూర్ణ చందర్, గఫార్, బండ నరేష్, పోరెడ్డి శాంతన్ రెడ్డి, పుల్లూరి ప్రభాకర్ రావు, తాళ్లపెల్లి శ్రీనివాస్, మంద సతీష్, ధనవర్ష రాజు, ఆర్కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.