ముస్తాబాద్, డిసెంబర్25: సెస్ ఎన్నికల్లో విజయం తమదేనని బీఆర్ఎస్ నాయకులు కొమ్ము బాలయ్య, సంతోష్‌గౌడ్, గూడెం ఉప సర్పంచ్ చాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వారు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో మా ట్లాడారు. మంత్రి కేటీఆర్ సహకారంతో బరిలో నిలిచిన బీఆర్ఎస్ సందుపట్ల అంజిరెడ్డి గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ చేస్తున్న అభివృద్ధిని కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులు అఖండ మోజార్టీతో గెలుపొంది, సెస్ కార్యాలయంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి, నాయకులు అన్వర్, తదితరులు పాల్గొన్నారు.