దేవాలయానికి పోటెత్తిన భక్తులు
బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి, పోచమ్మ తల్లికి మొక్కుల చెల్లింపులు
అమ్మవార్లకి ఓడి బియ్యం, బోనాలు సమర్పించిన మహిళలు
sultanabad | సుల్తానాబాద్ రూరల్ మార్చి 26: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాలలోని బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత సంవత్సరం నిర్వహించారు. కాగా అందులో భాగంగా బుధవారం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి తిరుగు బోనాలతో ప్రతీ ఇంటి నుండి బోనం వండుకుని శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుల్లతో పురవీధులు తిరుగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం, ఓడి బియ్యం, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా అంతకు ముందు బైండ్ల పూజారులచే బొడ్రాయి విగ్రహాలకు అలంకరణ చేసి, పట్నాలు వేసి, బలి తదితర కార్య్రకమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ సభ్యులు, కుల సంఘాల ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.