3 గంటల కాంగ్రెస్‌ను ఖతం చేద్దాం
‘కాంగ్రెస్‌కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్‌ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది.
- వారికి అధికారమిస్తే అంధకారమే
- రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి
- మూడు గంటల కరెంట్‌తో ఒరిగేదేంటి?
- మూడు పంటల బీఆర్ఎస్కు అండగా నిలుద్దాం
- రైతు వేదికల సాక్షిగా ముక్తకంఠంతో కర్షకలోకం తీర్మానం
‘కాంగ్రెస్‌కు అధికారమిస్తే వ్యవసాయం అంధకారమవుతది. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్‌ను ఖతం చేస్తేనే మనకు న్యాయం జరుగతది’ అంటూ రైతాంగం ముక్తకంఠంతో నినదించింది. వ్యవసాయంపై అవగాహన లేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి అని మండిపడ్డది. ఉచిత కరెంట్‌పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను నాలుగో రోజు గురువారం రైతు వేదికల సాక్షిగా ఎండగట్టింది. ఆయన ముక్కు నేలకు రాసి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ‘మూడు గంటల కాంగ్రెస్ మాకొద్దు. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆరెఎస్సే ముద్దు’ అంటూ తీర్మానాలు చేసింది. రేవంత్‌కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేర దాకా తరిమికొడుతామని తేల్చిచెప్పింది.
– కరీంనగర్, జూలై 20(నమస్తేతెలంగాణ)
కరీంనగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉచిత కరెంట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ వైఖరిపై రైతాంగం ఆగ్రహం చల్లారడంలేదు. 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్‌ను పాతరేస్తామని నినదిస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతు వేదికల సాక్షిగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. మూడురోజులుగా వేలాదిమంది తరలివచ్చి కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. నాలుగోరోజు గురువారం కూడా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించుకున్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకటే. హస్తం పార్టీ వద్దు. కేసీఆర్ సర్కారే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.
‘రేవంత్‌రెడ్డి రైతు ద్రోహి.. కాంగ్రెస్‌ను పాతరేద్దాం’ అంటూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొని రైతాంగానికి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకట్లు అలుముకుంటాయని చెప్పారు. రైతు అనుకూల విధానాలు అనుసరిస్తున్న రైతుపక్షపాత బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలువాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్‌తోనే అన్నదాతకు మేలు జరుగుతందని పేర్కొన్నారు. ‘మూడు గంటల కాంగ్రెస్‌ను తరిమికొడదాం. మూడు పంటల బీఆర్ఎస్ సర్కారుకు అండగా నిలుద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. అనంతరం కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేశారు.

- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్, జమ్మికుంట మండలం వావిలాల రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత కరెంట్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
- జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్, మల్లాపూర్ మండలం ముత్యంపేట రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల రైతు వేదిక వద్ద రైతులతో కలిసి జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత నిరసన తెలిపారు. మల్యాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల, ఓదెల మండలం గుండ్లపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని, కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట మునుగుడు ఖాయమని రైతులకు సూచించారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం బ్రహ్మణపల్లి రైతు వేదికలో రైతు సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ తీశారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ సమావేశం వద్దకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతు కంటక కాంగ్రెస్‌ను బొందపెడదామని రైతులకు పిలుపునిచ్చారు.

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

