Peddapally | పెద్దపల్లి టౌన్ : అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను అడ్డగించి పోలీసులకు సమాచారం అందజేశారనే కారణంతో గో రక్షకుడు ప్రశాంత్ సోనుపై ఎంఐఎం పార్టీకి చెందిన కొంతమంది కాల్పులు సరైనది కాదని గోవులను కాపాడుతున్న గోరక్షకులపై తుపాకీతో దాడి చేయడం అమానుష చర్యని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం డిమాండ్ తీవ్రంగా ఖండించారు.
తుపాకీతో దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతిపత్రం అందజేసి కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, శివ, సతీష్, బెజ్జంకి దిలీప్, కరుణాకర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.