TRTF | మల్లాపూర్ డిసెంబర్ 19: ఈనెల 21న హైదరాబాదులో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన అభ్యుదయ ఉత్సవ విద్యా సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేష్ అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయ సంఘం నాయకులతో కలిసి సంబంధిత పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పూర్వం ఏర్పడి స్వరాష్ట్రంలో టీఆర్టీఎఫ్ గా అవతరించి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యా అభిమానులు పెద్ద సంఖ్యలో హజరై విజయాంతం చేయాలని తెలిపారు. ఇక్కడ హెచ్ఎం చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జంగ గంగాధర్, కుంట భూమేశ్వర్, మండల అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాజరత్నం, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.