Godavarikhani | రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనంతో ఉద్రిక్తత.. కార్పొరేటర్ బట్టలు చిరిగిన ఘటన
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీపీఐ ఫ్లోర్ లీడర్, 41 వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆధ్వర్యంలో చేపట్టిన రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అనుమతి లేకుండా ఆందోళన చేయడం పట్ల గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆగ్రహించారు.
- కూల్చివేతలతో ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు న్యాయం చేయాలని కార్పొరేటర్ ఆందోళన
- బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 30 : గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సీపీఐ ఫ్లోర్ లీడర్, 41 వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ఆధ్వర్యంలో చేపట్టిన రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అనుమతి లేకుండా ఆందోళన చేయడం పట్ల గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆగ్రహించారు. ఆందోళన కారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో జరిగిన తోపులాటలో కార్పొరేటర్ బట్టలు చినిగిపోవడం, అక్కడితో ఆగకుండా బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంఘటన చౌరస్తాలో అలజడి వాతావరణం సృష్టించింది. గోదావరిఖని ఎల్బీ నగర్, తిలక్ నగర్లో కూల్చివేతలతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆ డివిజన్ కార్పొరేటర్ మార్కాపురి సూర్య ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ నాయకులు, బాధితులతో కలిసి గోదావరిఖని చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ రోడ్ల వెడల్పు, అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎల్బీనగర్, తిలక్ నగర్ లో ఏళ్ల తరబడి దుకాణాలు నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను నమ్మించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించి ఇస్తామని ఆశ చూపించి ఎక్కడికి అక్కడ కూల్చి వేశారని, ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లే నిర్మించి అర్ధరాత్రి వేళ అనుమతులు లేవంటూ వారే కూల్చి వేయించడం ఏమిటని ప్రశ్నించారు. కూల్చివేతలతో ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడి కంటతడి పెడుతుంటే వాళ్ళను చూసి ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సంఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆందోళన కారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఆందోళనలు చేయడం తగదంటూ కార్పొరేటర్ సూర్య, కార్యకర్తలను అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- cpi
- Godavarikhani
- Peddapally
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

