sarangaapoor | సారంగాపూర్, జూన్ 17: సారంగాపూర్ మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లి శివారులో మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ. 2.85కోట్లు మంజూరి చేసింది. పోతారం శివారులోని గణేష్ పల్లి శివారులో 8.06 ఎకరాల ప్రభుత్వ భూమిని గురించి మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణాలకు తహసీల్దార్ స్థలాన్ని కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తైనా నిధుల లేమితో అగ్రిమెంట్ కాక నిర్మాణ పనులకు మోక్షం లేకుండా పోయింది.
2016-17 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో మినిస్టేడియం ఏర్పాటు కోసం గణేషపల్లి శివారులో స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. మినీ స్టేడియం ఏర్పాటుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రూ.2.65 కోట్లు కేటాయిస్తు నిధులు విడుదల చేసింది. సంబంధిత శాఖ అధికారులు టెండర్లు ప్రక్రియను పూర్తి చేశారు. మినిస్టేడియంలో అవుట్ డోర్ ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు అనుకులంగా ఉంటుంది. కండి, వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, టెన్నిస్, క్యాట్మెంటన్లతో పాటు ఇతర ఇండోర్ గేమ్స్ ఉంటాయి.
రెండు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఒకటి చిన్నది. మరోకటి పెద్దగా ఉంటుంది. మొదట మినీస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటుకు అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం రూ.2.65కోట్లు మంజూరు చేయగా, పూర్తి స్థాయిలో మినిస్ట్రీడియం, స్విమ్మింగ్స్ ఫూల్స్ నిర్మాణం చేపట్టడం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా మరో రూ.35 లక్షలు మంజూరికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారుల సమాచారం. టెండర్ ప్రక్రియ పూర్తై కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కాక పోవడంతో మండలంలో మినీ స్టేడియం, స్విమ్మింగ్ పూర్తి ఏర్పాటు కలగా మిగిలనుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.