Brs peddaplly | పెద్దపల్లి, ఏప్రిల్ 21( నమస్తే తెలంగాణ): ఈనెల 27 న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే రజతోత్సవ సభ ను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన రజతోత్సవ సభ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గం నుండి సుమారు పదివేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి బీఆర్ఎస్ పార్టీ, అనాటి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సభ యావత్ తెలంగాణ చరిత్రలోనే అత్యంత గొప్ప సభ కానున్నదని ఆయన వెల్లడించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి, ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి, ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతొందని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఏర్పడి 25వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంగా ఈ సభను గొప్పగా నిర్వహించుకోవడానికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి లక్షలాదిగా ప్రజలు తరలి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి దాదాపుగా పదివేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆయా గ్రామాలకు ఇన్చార్జిలను, వాహనాల వారిగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందనీ, పెద్ద ఎత్తున గ్రామాల ఎంత ఉత్సాహంగా సభకు వెళ్లడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అంతట వారే ఉత్సాహంతో రజతో సభకు వెళ్లడానికి ముందుకు వస్తున్నారనీ పేర్కొన్నారు. ఒక జాతరకు అలాగే ఒక తీర్థానికి వెళ్లేవారు లాగా బీ ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ కార్యక్రమానికి వెళ్లడానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా ఉన్నారన్నారు.
ఈ సభ మన ఆత్మగౌరవ పండుగ అని , తెలంగాణ బిడ్డల పండుగ అని, రజతోత్సవ సభ అంటేనే ఇది మన అందరికీ గుర్తింపు ఇచ్చే సభ కాబట్టి అందరం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా వెళ్లి ఆ సభలో మనము హాజరై మన ప్రియతమ నాయకులు చెప్పే మాటలను విని, క్షేమంగా గ్రామానికి వచ్చి, పార్టీ అధినేత కెసిఆర్ చెప్పిన మాటలను ప్రజలందరితోని మాట్లాడుతూ చర్చ పెడుతూ ప్రజలందరిలో ఉత్సాహాన్ని నింపేందుకు ముందుండాలన్నారు. కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా వెళ్లి సభను విజయవంతం దాసరి మనో రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తానిపర్తి బాలాజీ రావు, పెద్దపల్లి, ఓదెల మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్, ఐరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, తానిపర్తి మోహన్ రావు, సయ్యద్ ముబీనుద్దీన్, నిదానపురం దేవయ్య, పూదరి చంద్ర శేఖర్, నెత్తెట్ల సతీష్, కమటపు శ్రీధర్, ప్రేమ్, శ్రీకాంత్, బైరం నటరాజ్, అతిక్, ముబాసిడర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.