Indurthi Bridge | చిగురుమామిడి, అక్టోబర్ 31: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కోహెడ వెళ్లే రహదారి బ్రిడ్జిపై ఇదివరకు భారీగా ఎల్లమ్మ వాగు పొంగి పర్లడంతో రెండు రోజులు వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి శుక్రవారం కొంత తగ్గడంతో బాటసారులు ఇందుర్తి బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టారు.
ఇటీవల కాలంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎల్లమ్మ వాగు తరచూ పొంగిపొర్లడంతో పురాతన బ్రిడ్జి పలు ప్రదేశాల్లో గుంత ఏర్పడ్డాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా బాటసారులు శ్రమదానం చేశారు. వీరి పనిపై పలువురు అభినందనలు తెలిపారు.