Bhagya Reddy Varma | కోల్ సిటీ , మే 22: శతాబ్దం కిందటే దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటస్వామి అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో గురువారం భాగ్యరెడ్డి వర్మ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకనాడు దళిత చైతన్యంకు, సామాజిక వర్గం అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన కార్యశీలి అని, 1925లో ప్లేగు, కలరా అంటు వ్యాధులతో భాగ్యనగర ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే స్వస్తి సేవా దళ్ సంస్థను ఏర్పాటు చేసి తన ప్రాణాలకు తెగించి అంటువ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. బాలికలకు ప్రత్యేక పాఠశాల ప్రాధాన్యతను గుర్తించి 1910లోనే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన తొలి దళిత చైతన్య కరదీపిక భాగ్యరెడ్డి వర్మ అన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీహరి, ఆర్ ఓ ఆంజనేయులు, అకౌంట్ ఆఫీసర్ రాజు, ఏఈ చంద్రమౌళి, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఆర్ఐ శంకర్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, హెల్త్ అసిస్టెంట్ సంపత్, శంకర్ స్వామి, మెప్మా టిఎంసి మౌనిక, సి ఓ లు, వార్డు ఆఫీసర్లు , సిబ్బంది పాల్గొన్నారు.