Formation Day| కోరుట్ల, జూన్ 2: పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోర్టు ఆవరణలో న్యాయమూర్తి అరుణ్ కుమార్, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈసందర్బంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ఉద్యమ స్పూర్తి చరిత్రలో నిలిచి పోతుందన్నారు. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు.
అలాగే పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనూప్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఫహీం, నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, సజ్జు, పేర్ల సత్యం, కాశిరెడ్డి మోహన్ రెడ్డి, అన్వర్, పొట్ట సురేందర్, జాల వినోద్, భూపే ల్లి నగేష్, తదితరులు పాల్గొన్నారు.