కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : ఉమ్మడి జిల్లాలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల కలెక్టరేట్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, పెద్దపల్లి కలెక్టరేట్లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ సాహెబ్ హాజరై, జాతీయ పతాకాలు ఎగరేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
అరవై ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని చెప్పారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని వివరించారు.