గంగాధర, జనవరి 12: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆచంపల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల్లో మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా మహిళా సంఘ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే, గర్శకుర్తిలో పద్మశాలీ సంఘ భవనానికి రూ. 4.60 లక్షలు, ఓపెన్ జిమ్ కోసం రూ. 4.60 లక్షలు మంజూరయ్యాయి. కాగా, బూరుగుపల్లిలోని నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంబంధిత నాయకులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కొండగట్టు దేవస్థానం బోర్డు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మాజీ జడ్పీటీసీ ఆకుల శ్రీలత, సర్పంచ్ కొంకటి శంకర్, ఎంపీటీసీలు కోలపురం లక్ష్మణ్, అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, దూలం శంకర్‌గౌడ్, బెజ్జంకి కళ్యాణ్, తడిగొప్పుల రమేశ్, అలువాల తిరుపతి, తడిగొప్పుల రమేశ్, మహేశుని ఈశ్వరయ్య, విఠోబా, వార్డు సభ్యులు, పద్మశాలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.