Former MLA Sunke Ravishankar | గంగాధర, అక్టోబర్ 28 : మరో బీహార్ లా తెలంగాణ రాష్ర్టం మారిందని, కురిక్యాల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన బాధ్యులైన ప్రతీ ఒక్కరిని ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కురిక్యాల జడ్పీ ఉన్నత పాఠశాలను స్థానిక బీఆర్ఏస్ నాయకులతో కలసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై కనీసం ఒక్క సమీక్షలు నిర్వహించలేదని దుయ్యబట్టారు. విద్యార్థులపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50-60 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు, పలు విద్యాలయాలో వేధింపుల సంఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించలేదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.